యాదాద్రి తరహాలో వేములవాడ అభివృద్ధి

ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడను రానున్న రోజుల్లో యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు.

Updated : 08 Feb 2023 05:22 IST

శివరాత్రి ఉత్సవాలకు అదనపు నిధులు
సమీక్షలో మంత్రి కేటీఆర్‌ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడను రానున్న రోజుల్లో యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఆలయంలో నిర్వహించే మహా శివరాత్రి వేడుకలపై మంగళవారం ఆయన.. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ అఖిల్‌ మహాజన్‌, ఇతర అధికారులతో హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. శివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, అదనపు అంబులెన్సు, ఫైర్‌ అంబులెన్సులను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. జాతరకు సౌకర్యాలు కల్పించేందుకు అదనపు నిధులు కేటాయిస్తామని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని