వరంగల్‌లో ఎల్‌ అండ్‌ టీ మైండ్‌ట్రీ పంపిణీ కేంద్రం

ప్రసిద్ధ ఐటీ సంస్థ ఎల్‌ అండ్‌ టీ ఇన్‌ఫోటెక్‌ మైండ్‌ట్రీ సంస్థ వరంగల్‌ ఐటీ పార్కులో తమ పంపిణీ కేంద్రం(డెలివరీ సెంటర్‌)ను ఈ నెలాఖరులో ప్రారంభించనుంది.

Published : 08 Feb 2023 03:28 IST

నెలాఖరుకు ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రసిద్ధ ఐటీ సంస్థ ఎల్‌ అండ్‌ టీ ఇన్‌ఫోటెక్‌ మైండ్‌ట్రీ సంస్థ వరంగల్‌ ఐటీ పార్కులో తమ పంపిణీ కేంద్రం(డెలివరీ సెంటర్‌)ను ఈ నెలాఖరులో ప్రారంభించనుంది. ప్రారంభోత్సవంలో పాల్గొనాలని సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు గొల్లపు కృష్ణ మంగళవారం పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసి ఆహ్వానించారు. ఇందుకు మంత్రి అంగీకరించారు. తమకు హామీ ఇచ్చిన మేరకు సత్వరమే పంపిణీ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నందుకు కృష్ణను అభినందించారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ విస్తరణకు తమ ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు ఫలవంతమవుతున్నాయని, ప్రసిద్ధ సంస్థలన్నీ వరంగల్‌ తదితర ప్రాంతాల్లో తమ పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు. వరంగల్‌ పంపిణీ కేంద్రంలో 150 మందికి ఉపాధి కల్పించనున్నట్లు గొల్లపు కృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు