జోషిమఠ్‌లో భూకంపం వచ్చే ఆస్కారం
భూకంపాలను తట్టుకునేలా నిర్మాణాలు లేకపోవడం, నాసిరకం నిర్మాణాలతో తుర్కియేలో తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఎన్జీఆర్‌ఐలోని భూకంప పరిశోధన కేంద్రం చీఫ్ సైంటిస్ట్ పూర్ణచందర్‌రావు తెలిపారు.
నాసిరకం నిర్మాణాలతోనే తుర్కియేలో తీవ్ర నష్టం
ఎన్జీఆర్‌ఐ శాస్త్రవేత్త పూర్ణచందర్‌రావు
ఈనాడు, హైదరాబాద్: భూకంపాలను తట్టుకునేలా నిర్మాణాలు లేకపోవడం, నాసిరకం నిర్మాణాలతో తుర్కియేలో తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఎన్జీఆర్‌ఐలోని భూకంప పరిశోధన కేంద్రం చీఫ్ సైంటిస్ట్ పూర్ణచందర్‌రావు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘భూకంప తీవ్రత 7.8గా నమోదవడం, రాత్రివేళలో సంభవించడం వల్ల అక్కడ మృతుల సంఖ్య పెరిగింది. భూకంప కేంద్రం 18 కిలోమీటర్ల లోతులోనే ఉండటంతో తీవ్రత ఎక్కువగా కనిపించింది. 30 కిలోమీటర్ల లోతులో ఉండి ఉంటే తీవ్రత ఇంతలా ఉండేది కాదు. భూకంపం వస్తుందని ముందస్తు హెచ్చరికలు చేసే సాంకేతికత మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఎప్పుడొస్తుంది? ఎన్నిసార్లు వస్తుందనే విషయమై పరిశోధనలు జరుగుతున్నాయి. జోషిమఠ్‌లో భూకంపం వచ్చే అవకాశముందని అంచనా. హిమాలయాల చుట్టూ పక్కల ప్రాంతంలో ఎక్కువ భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. 1897, 1905, 1934, 1950లో అక్కడ తీవ్ర భూకంపాలు సంభవించాయి. 1934 తర్వాత నేపాల్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో పెద్ద భూకంపం సంభవించలేదు. మున్ముందు ఆ ప్రాంతాల్లోనూ భూకంపాలొచ్చే ఆస్కారముంది. భూకంపాల తీవ్రతను తట్టుకునేలా ప్రత్యేక నిర్మాణాలపై ప్రభుత్వం ప్రమాణాలను నిర్దేశించింది. కొందరు వీటిని పట్టించుకోవడం లేదు. భూకంపాలను తట్టుకునేలా రెట్రోఫిట్టింగ్ ద్వారా పాత భవనాలను మరింత దృఢంగా చేసే అవకాశం ఉంది’’ అని పూర్ణచందర్‌రావు వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Panaji: 10ఏళ్ల బాలుడి సాహసం.. నీటిలో మునుగుతున్న స్నేహితులను కాపాడి..
-
Politics News
MP Laxman: కేసీఆర్ కుటుంబ కలలు కల్లలుగానే మిగిలిపోతాయ్: ఎంపీ లక్ష్మణ్
-
Politics News
Modi - Rahul: కాంగ్రెస్ ర్యాలీ వాయిదా..ఒకేరోజు మోదీ, రాహుల్ మీటింగ్స్
-
Politics News
CM KCR: నా రాజకీయ జీవితమంతా పోరాటాలే: సీఎం కేసీఆర్
-
Politics News
Andhra News: రూ.లక్షల కోట్ల ప్రజాధనం తీసుకొచ్చి అమరావతి గోతుల్లో పోయాలా?: మంత్రి బొత్స
-
Crime News
Crime: అసలే త్రిపుల్ రైడింగ్... ఒక్కరికి హెల్మెట్లు లేవు..పైగా వన్ వీల్‌తో విన్యాసాలు..