పెద్దగట్టు జాతరలో ఘనంగా ‘చంద్రపట్నం’

సూర్యాపేట పురపాలిక పరిధి దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి జాతరలో మూడోరోజైన మంగళవారం స్వామివారికి చంద్రపట్నం (పసుపు, కుంకుమలతో దేవరపెట్టె ముందు వేసే ముగ్గు) కార్యక్రమం వైభవంగా ముగిసింది.

Published : 08 Feb 2023 03:43 IST

ముగిసిన స్వామివారి కల్యాణ క్రతువు

ఈనాడు, నల్గొండ, న్యూస్‌టుడే, చివ్వెంల: సూర్యాపేట పురపాలిక పరిధి దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి జాతరలో మూడోరోజైన మంగళవారం స్వామివారికి చంద్రపట్నం (పసుపు, కుంకుమలతో దేవరపెట్టె ముందు వేసే ముగ్గు) కార్యక్రమం వైభవంగా ముగిసింది. అనంతరం కల్యాణ క్రతువును హక్కుదారులైన యాదవ సోదరులు పూర్తి చేశారు. వరుడు లింగమంతుల స్వామి తరుఫున మెంతబోయిన వారు, వధువు మాణిక్యమ్మ తరఫున మున్న వంశీయులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పోతరాజు, భైరవుల వేషధారణలో ఇరువర్గాలు సంప్రదాయ పద్ధతిలో కటారులను తిప్పి స్వామివారి ఆశీర్వాదం అందుకున్నారు. చంద్రపట్నం, కల్యాణ మహోత్సవంలో మంత్రి జగదీశ్‌రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో మూడోరోజు భక్తుల కోలాహలంతో క్షేత్రం సందడిగా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని