ఆచార్య రాబర్ట్‌ ఎస్‌ లాంగర్‌కు జీనోమ్‌ వ్యాలీ ఎక్స్‌లెన్స్‌ అవార్డు

బయో ఆసియా 20వ విడత సదస్సును పురస్కరించుకొని 2023 సంవత్సరానికి ‘జీనోమ్‌ వ్యాలీ ఎక్స్‌లెన్స్‌’ పురస్కారాన్ని ఆచార్య రాబర్ట్‌ ఎస్‌ లాంగర్‌కు ప్రకటించారు.

Published : 08 Feb 2023 03:43 IST

ఈనాడు, హైదరాబాద్‌: బయో ఆసియా 20వ విడత సదస్సును పురస్కరించుకొని 2023 సంవత్సరానికి ‘జీనోమ్‌ వ్యాలీ ఎక్స్‌లెన్స్‌’ పురస్కారాన్ని ఆచార్య రాబర్ట్‌ ఎస్‌ లాంగర్‌కు ప్రకటించారు. ఇన్‌ఫెక్షస్‌ డిసీజెస్‌ను నిరోధించడానికి వినియోగించే ‘ఎంఆర్‌ఎన్‌ఏ’ టీకాను వృద్ధి చేయడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. లాంగర్‌ ప్రస్తుతం అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ)లో పనిచేస్తున్నారు. క్యాన్సర్‌ వ్యాధిని తొలిదశలో గుర్తించడం, చికిత్స అందించడంలో మెరుగైన విధానాలను అందించడంపై పరిశోధనలు కొనసాగిస్తున్నారు. వివిధ వైద్య పత్రికల్లో సుమారు 1,500కు పైగా శాస్త్రీయ పరిశోధన పత్రాలను రచించారు. తెలంగాణ ప్రభుత్వం సహకారంతో ఈ నెల 24 నుంచి 26 వరకూ హెచ్‌ఐసీసీలో నిర్వహిస్తున్న బయో ఆసియా సదస్సులో లాంగర్‌కు ఈ పురస్కారాన్ని అందజేస్తారు. పురస్కార గ్రహీతను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అభినందించారు. జీవశాస్త్ర రంగంలో విశేష సేవలందించిన రాబర్ట్‌ ఎస్‌ లాంగర్‌కు ఈ పురస్కారం అందజేయడాన్ని తాను గౌరవంగా భావిస్తున్నానని మంత్రి చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని