భూకంప దృశ్యాలు.. హృదయవిదారకం: కేటీఆర్‌

తుర్కియే, సిరియాలో సంభవించిన భూకంప దృశ్యాలు హృదయవిదారకమని, అవి తనను తీవ్రంగా కలిచివేశాయని మంత్రి కేటీఆర్‌ మంగళవారం ట్విటర్‌లో తెలిపారు.

Updated : 08 Feb 2023 05:34 IST

ఈనాడు, హైదరాబాద్‌: తుర్కియే, సిరియాలో సంభవించిన భూకంప దృశ్యాలు హృదయవిదారకమని, అవి తనను తీవ్రంగా కలిచివేశాయని మంత్రి కేటీఆర్‌ మంగళవారం ట్విటర్‌లో తెలిపారు. ఈ ఘటన చాలా బాధాకరమని పేర్కొన్నారు. తుర్కియే, సిరియా ప్రజలకు ఆ భగవంతుడు మరింత శక్తినివ్వాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

రాష్ట్రంలో క్రీడలపై పెరుగుతున్న ఆసక్తి

జాతీయ రూపే వాలీబాల్‌ లీగ్‌ సందర్భంగా హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ జట్టు జెర్సీని మంత్రి కేటీఆర్‌ మంగళవారం ప్రగతిభవన్‌లోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలు, మౌలిక వసతుల కల్పనతో రాష్ట్రంలో క్రీడలపై ఆసక్తి పెరుగుతోందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ జట్లు బాగా రాణించి.. రాష్ట్రానికి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జట్టు యజమాని అభిషేక్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు