TS EAMCET: ఇంటర్‌ ఫస్టియర్‌లో 70% సిలబస్‌ నుంచే ఎంసెట్‌ ప్రశ్నలు

రాష్ట్రంలో మే 7 నుంచి జరిగే ఎంసెట్‌లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 70 శాతం సిలబస్‌ నుంచే ప్రశ్నలు ఇస్తారు. సెకండియర్‌లో మాత్రం 100 శాతం సిలబస్‌ నుంచి ప్రశ్నలుంటాయి.

Published : 09 Feb 2023 07:20 IST

ద్వితీయ సంవత్సరానికి పూర్తి సిలబస్‌
రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి స్పష్టీకరణ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మే 7 నుంచి జరిగే ఎంసెట్‌లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 70 శాతం సిలబస్‌ నుంచే ప్రశ్నలు ఇస్తారు. సెకండియర్‌లో మాత్రం 100 శాతం సిలబస్‌ నుంచి ప్రశ్నలుంటాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆర్‌.లింబాద్రి వెల్లడించారు. ఎంసెట్‌ రాయబోయే విద్యార్థులు 2021-22లో ఫస్టియర్‌ పరీక్షలు రాశారని, కరోనా కారణంగా అప్పుడు 70 శాతం సిలబస్‌తోనే వార్షిక పరీక్షలు నిర్వహించినందున ఎంసెట్‌లో ప్రథమ సంవత్సరంలో అదే సిలబస్‌ ఉంటుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని