ప్రావిడెన్స్‌ విస్తరణ

అమెరికాకు చెందిన ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల సంస్థ ప్రొవిడెన్స్‌ హెల్త్‌ సిస్టమ్స్‌ హైదరాబాద్‌లోని తమ పరిశ్రమను విస్తరించి మరో రెండువేల మందికి ఉపాధి కల్పించాలని నిర్ణయించింది.

Updated : 09 Feb 2023 04:45 IST

మరో రెండువేల మందికి ఉపాధి
మంత్రి కేటీఆర్‌తో సంస్థ ప్రతినిధుల భేటీ

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికాకు చెందిన ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల సంస్థ ప్రొవిడెన్స్‌ హెల్త్‌ సిస్టమ్స్‌ హైదరాబాద్‌లోని తమ పరిశ్రమను విస్తరించి మరో రెండువేల మందికి ఉపాధి కల్పించాలని నిర్ణయించింది. సంస్థ సీఈవో రాడ్‌హాచ్‌మాన్‌, సీవోవో బీజే మూర్‌, భారత విభాగాధిపతి మురళీకృష్ణలు తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ను బుధవారం ప్రగతిభవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా తమ సంస్థ విస్తరణ ప్రణాళికను వివరించారు. తమ పరిశ్రమ ద్వారా ప్రస్తుతం వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తున్నామని, విస్తరణ ద్వారా మొత్తం మూడువేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. సంస్థ ప్రతినిధులను మంత్రి సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు