కొండగట్టు ఆలయానికి రూ. 100 కోట్లు

తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated : 09 Feb 2023 08:37 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జగిత్యాల జిల్లా కొండగట్టులోని ఆంజనేయస్వామి ఆలయానికి రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల భక్తులూ అధికసంఖ్యలో వస్తుంటారు. ఆలయ అభివృద్ధికి రూ.వంద కోట్లు విడుదల చేస్తామని గత డిసెంబరులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ఈ నిధులను వెచ్చించనున్నారు.

సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత కృతజ్ఞతలు

ఇచ్చిన మాట మేరకు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిధులు విడుదల చేసినందున ఆయనకు భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కృతజ్ఞతలు తెలిపారు. ఈ భారీ సాయంతో దేశంలోని గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా కొండగట్టు రూపు దిద్దుకుంటుందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు