అంతర్జాతీయ క్రికెట్‌ క్రీడాకారిణి త్రిషకు అభినందనలు

అండర్‌-19 మహిళా క్రికెట్‌ ఛాంపియన్‌షిప్‌ను సాధించిన భారత జట్టు సభ్యురాలైన తెలంగాణ క్రీడాకారిణి త్రిషను మంత్రి కేటీఆర్‌ అభినందించారు.

Updated : 09 Feb 2023 05:33 IST

ఈనాడు, హైదరాబాద్‌: అండర్‌-19 మహిళా క్రికెట్‌ ఛాంపియన్‌షిప్‌ను సాధించిన భారత జట్టు సభ్యురాలైన తెలంగాణ క్రీడాకారిణి త్రిషను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. ఆమె తన కుటుంబసభ్యులతో కలిసి బుధవారం కేటీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆమె ప్రతిభను కొనియాడారు. తెలంగాణకు మరింత ఖ్యాతి తేవాలని ఆకాంక్షించారు.

6 నెలల్లో మరో 30 డబుల్‌ డెక్కర్‌ బస్సులు

వచ్చే ఆరు నెలల్లో హైదరాబాద్‌లో మరో 30 డబుల్‌డెక్కర్‌ బస్సులను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో తెలిపారు. దీనిపై టీఎస్‌ఆర్టీసీతో కలిసి పనిచేయాలని ఆయన పురపాలక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌కు సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని