ఉష్ణోగ్రతలు పైపైకి.. పలుచోట్ల గతేడాది కన్నా రెండు డిగ్రీలు ఎక్కువ..

నడివేసవి రాకముందే రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో రోజూ నమోదవుతున్న ఉష్ణోగ్రతలు గతేడాదితో పోల్చితే రెండు డిగ్రీలు ఎక్కువగా ఉంటున్నాయి.

Updated : 05 Mar 2023 07:25 IST

ఈనాడు, హైదరాబాద్‌: నడివేసవి రాకముందే రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో రోజూ నమోదవుతున్న ఉష్ణోగ్రతలు గతేడాదితో పోల్చితే రెండు డిగ్రీలు ఎక్కువగా ఉంటున్నాయి. మరికొన్ని జిల్లాల్లో ఒకటిన్నర నుంచి ఒక డిగ్రీపైనే ఉంటున్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో గతేడాది నాలుగో తేదీన 37.3 డిగ్రీలు నమోదు కాగా.. శనివారం 40 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. ములుగు జిల్లాలోనూ 40 డిగ్రీలు నమోదైంది. రాత్రిపూట కూడా సాధారణ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, భద్రాచలంలలో 21 డిగ్రీలను దాటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని