Preethi Case: ఔను.. ర్యాగింగ్ చేశాను!.. పోలీసుల విచారణలో అంగీకరించిన సైఫ్?
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రీతి మృతి కేసు కీలక మలుపులు తిరుగుతోంది. సీనియర్ పీజీ విద్యార్థి సైఫ్ ఆమెను ర్యాగింగ్ చేసినట్లు పోలీసుల ఎదుట ఎట్టకేలకు ఒప్పుకొన్నట్లు తెలిసింది.
ఈనాడు, వరంగల్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రీతి మృతి కేసు కీలక మలుపులు తిరుగుతోంది. సీనియర్ పీజీ విద్యార్థి సైఫ్ ఆమెను ర్యాగింగ్ చేసినట్లు పోలీసుల ఎదుట ఎట్టకేలకు ఒప్పుకొన్నట్లు తెలిసింది. ఫిబ్రవరి 22న ప్రీతి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో అపస్మారక స్థితిలోకి వెళ్లడం, తర్వాత నిమ్స్‌కు తరలించగా.. ఫిబ్రవరి 26న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.
ప్రీతి ఆత్మహత్యకు సైఫ్ ర్యాగింగ్ కారణమని పోలీసులు తెలిపినా.. అతడు ఖండిస్తూ వచ్చాడు. తాను సీనియర్‌ను కనుక ప్రీతి వృత్తి రీత్యా పొరపాట్లు చేయడం వల్ల తప్పని చెప్పానే కానీ.. అది ర్యాగింగ్ కాదని వాదించాడు. కానీ పోలీసులు వాట్సప్ చాటింగ్‌లు బయటకు తీసి సైఫ్ ఉద్దేశపూర్వకంగానే ప్రీతిని ర్యాగింగ్ చేసినట్టు నిర్ధారించి అతడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
పోలీసులు 4 రోజులపాటు జరిపిన విచారణలో ఆధారాలు చూపించి సైఫ్‌ను ప్రశ్నించగా, తాను ర్యాగింగ్‌కు పాల్పడ్డది నిజమేనని, చాటింగ్ కూడా చేశానని సైఫ్ అంగీకరించినట్లు సమాచారం. కస్టడీ ముగిశాక మార్చి 6న కోర్టులో నిందితుడిని ప్రవేశపెట్టిన సమయంలో పోలీసులు కోర్టుకు సమర్పించిన కన్ఫెషన్ రిపోర్టులో ఈ విషయాలను పేర్కొన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
మంత్రి నాగార్జున కసురుకొని, బయటకు నెట్టేయించారు
-
India News
రూ.2వేల నోట్ల మార్పిడికి అనుమతిపై రిజిస్ట్రీ నివేదిక తర్వాతే విచారణ: సుప్రీం
-
Politics News
చంద్రబాబు గొప్ప నాయకుడు.. భాజపా పెద్దల్ని ఎందుకు కలిశారో ఆయన్నే అడగండి: సోము వీర్రాజు
-
Sports News
WTC Final: భారత్ ఈ రోజు పుంజుకోకుంటే..
-
Crime News
Kakinada: ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బైక్.. ముగ్గురి మృతి
-
India News
Padmini Dian: పొలం పనుల్లో మహిళా ఎమ్మెల్యే