Rain Alert: రానున్న మూడు రోజుల్లో వర్షాలు..వడగళ్లు

రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ పేర్కొంది.

Updated : 14 Mar 2023 07:05 IST

ఈనాడు, హైదరాబాద్‌: రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ పేర్కొంది. ఉరుములుమెరుపులతో వానలు, ఈదురుగాలులు వీస్తాయంది. రాష్ట్రంవైపు తూర్పు, ఆగ్నేయదిశల నుంచి గాలులువీస్తున్నాయని, వాతావరణశాఖ డైరెక్టర్‌ నాగరత్న సూచించారు.

* 15వ తేదీ మధ్యాహ్నం నుంచి ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు జల్లులు కురుస్తాయి.

* 16వ మధ్యాహ్నం నుంచి నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి ప్రాంతాల్లో వడగళ్లు పడే అవకాశం ఉంది.

* 17వ తేదీన నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల గాలి తీవ్రత ఎక్కువగా ఉండవచ్చని తెలిపారు.

భద్రాద్రి జిల్లా నాయుడుపేటలో 39.8 డిగ్రీలు... 

రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలపైన నమోదయ్యాయి. గరిష్ఠంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయుడుపేటలో 39.8 డిగ్రీల సెల్సియస్‌ నమోదయింది. భద్రాచలంలో సాధారణం కన్నా రెండు డిగ్రీలు పెరుగుదల నమోదయింది. వనపర్తి జిల్లా పెబ్బేరులో 39.1, ఆదిలాబాద్‌ జిల్లా జీఎస్‌ఈ ఎస్టేట్‌లో 39.1, జగిత్యాల జిల్లా ఎండపల్లి, పెద్దపల్లి జిల్లా మంథనిలలో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌, నల్గొండ, నిజామాబాద్‌, రామగుండం, మెదక్‌లలో సాధారణం కన్నా ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యాయి. రాత్రిపూట కూడా చాలా ప్రాంతాల్లో సాధారణం కన్నా తక్కువ నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని