TSRTC: రూ.116 చెల్లిస్తే ఇంటికే భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు

శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో జరిగే సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తులకు అందించాలని ఆర్టీసీ నిర్ణయించింది.

Updated : 16 Mar 2023 07:13 IST

బుకింగ్‌ ప్రారంభించిన ఆర్టీసీ

ఈనాడు, హైదరాబాద్‌: శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో జరిగే సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తులకు అందించాలని ఆర్టీసీ నిర్ణయించింది. కావాల్సినవారు తమ కార్గో పార్సిల్‌ కేంద్రాల్లో రూ.116 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాలని సంస్థ ఎండీ సజ్జనార్‌ సూచించారు. హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో కల్యాణ తలంబ్రాల బుకింగ్‌ పోస్టర్‌ను బుధవారం ఆయన ఆవిష్కరించారు. కల్యాణోత్సవం అనంతరం తలంబ్రాలను భక్తుల ఇంటికే పంపిస్తామని తెలిపారు. రూ.116 చెల్లించి బుకింగ్‌ను ప్రారంభించారు. ‘గతేడాది దాదాపు 89 వేల మందికి తలంబ్రాలను అందించాం. శ్రీరామనవమికి వెళ్లలేని భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలి’ అని కోరారు. ఈ సేవలను పొందాలనుకునేవారు 9177683134, 7382924900, 9154680020 ఆర్టీసీ లాజిస్టిక్స్‌ విభాగం ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్టీసీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌  వి.రవీందర్‌, జాయింట్‌ డైరెక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ పాటిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని