Basar: ఆన్‌లైన్‌లో సరస్వతీ అమ్మవారి పూజలు.. ఏప్రిల్‌ 1 నుంచి అందుబాటులోకి

ప్రముఖ పుణ్యక్షేత్రమైన నిర్మల్‌ జిల్లాలోని బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో ఆన్‌లైన్‌ పూజలు అందుబాటులోకి రానున్నాయి.

Updated : 16 Mar 2023 07:09 IST

ముథోల్‌(బాసర), న్యూస్‌టుడే: ప్రముఖ పుణ్యక్షేత్రమైన నిర్మల్‌ జిల్లాలోని బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో ఆన్‌లైన్‌ పూజలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చేతులమీదుగా ఆలయంలో మంగళవారం ప్రారంభమైన ఈ సేవలను ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అమలుపరచనున్నారు. పూజలు, రుసుం వివరాలను దేవాలయానికి సంబంధించిన వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. విదేశీయులకు పోస్టల్‌ ఛార్జీలతో కలిపి రూ.2,516, స్థానికులకు రూ.1,516గా రుసుం నిర్ణయించారు. ఆసక్తి ఉన్న స్వదేశీ, విదేశీ భక్తులు ఆలయ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. భక్తులు కోరుకున్న పూజలను వేదపండితులతో చేయిస్తారు. పూజల అనంతరం ప్రసాదం, ఇతర సామగ్రిని భక్తులు ఆన్‌లైన్‌లో పేర్కొన్న చిరునామాకు తపాలా సేవల ద్వారా పంపిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని