Tirumala Darshan: ఆర్టీసీ టికెట్‌తో సులభంగా శ్రీవారి దర్శనం
తిరుపతికి టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు తిరుమల శ్రీవారిని సులభంగా, శీఘ్రంగా ప్రత్యేక దర్శనం చేసుకోవచ్చని సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు.
రోజూ వెయ్యి మందికి అవకాశం: బాజిరెడ్డి గోవర్దన్
ఈనాడు, హైదరాబాద్: తిరుపతికి టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు తిరుమల శ్రీవారిని సులభంగా, శీఘ్రంగా ప్రత్యేక దర్శనం చేసుకోవచ్చని సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి ఆర్టీసీ బస్సులు నడుపుతోందని, ప్రతి రోజు వెయ్యి మంది ప్రయాణికులకు రూ.300 శీఘ్ర దర్శన టికెట్లు ఇచ్చేందుకు అవకాశం ఉందన్నారు. దీన్ని భక్తులు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. మార్చి 18 వరకు టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో వెళ్లిన 1,14,565 మంది ప్రయాణికులకు తిరుమలలో ప్రత్యేక దర్శనం లభించిందని శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. తిరుమలలో భక్తుల రద్దీ, సాధారణంగా వెళ్లేవారికి దర్శనానికి పట్టే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు వెళ్లాలని, తద్వారా శ్రీవారి దర్శనం త్వరగా అవుతుందని సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్‌సైట్ ద్వారా రూ.300 టికెట్‌తో దర్శనం చేసుకోవాలంటే నెలరోజుల పాటు వేచి ఉండాల్సి వస్తోందని, అదే టీఎస్‌ఆర్టీసీ ద్వారా అయితే వారం రోజులు చాలని బాజిరెడ్డి తెలిపారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన బస్సుల్ని తిరుపతికి నడిపిస్తున్నట్లు వివరించారు. తిరుమల వెళ్లే భక్తులు మరిన్ని వివరాలకు టీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్ www.tsrtconline.in చూడాలని ఆయన సూచించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
‘వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటేయం’.. ఎచ్చెర్ల ఎమ్మెల్యేకు తేల్చిచెప్పిన వైకాపా కార్యకర్తలు
-
Crime News
కారుపై ‘పొక్లెయిన్’ పిడుగు!.. ముగ్గురి దుర్మరణం.. ఇద్దరికి తీవ్రగాయాలు
-
Ts-top-news News
రైళ్లపై రాళ్లేస్తే అయిదేళ్ల శిక్ష.. ద.మ.రైల్వే హెచ్చరిక
-
World News
వీర్యదానంతో 550 మందికి తండ్రైన వైద్యుడు
-
Ts-top-news News
రంగంలోకి కేంద్ర నిఘా సంస్థ.. డేటా లీకేజీ వ్యవహారంలో మలుపులు
-
Ap-top-news News
పాపికొండల విహారయాత్రకు పచ్చ జెండా