తపాలా ద్వారా భద్రాద్రి రాముడి ఆర్జిత సేవ, తలంబ్రాలు

భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఈ నెల 30న జరిగే శ్రీరామనవమి సందర్భంగా తపాలా శాఖ ద్వారా ప్రత్యేక సేవల్ని అందించనున్నట్లు తెలంగాణ తపాలా సర్కిల్‌ హైదరాబాద్‌ రీజియన్‌ తెలిపింది.

Updated : 19 Mar 2023 04:51 IST

ఈనాడు, హైదరాబాద్‌: భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఈ నెల 30న జరిగే శ్రీరామనవమి సందర్భంగా తపాలా శాఖ ద్వారా ప్రత్యేక సేవల్ని అందించనున్నట్లు తెలంగాణ తపాలా సర్కిల్‌ హైదరాబాద్‌ రీజియన్‌ తెలిపింది. ఇందులో భద్రాచలం సీతారామచంద్రస్వామి కల్యాణ తలంబ్రాలు-అంతరాలయ అర్చన, సీతారామ కల్యాణ తలంబ్రాల సేవలున్నాయని పేర్కొంది. కల్యాణ తలంబ్రాలు-అంతరాలయ అర్చనకు రూ.450, కల్యాణ తలంబ్రాలకు రూ.150 చెల్లించి బుక్‌ చేసుకోవాలని సూచించింది. తపాల్‌ యాప్‌, పోస్టుమ్యాన్‌, దగ్గరలోని తపాలా కార్యాలయం కౌంటర్‌ ద్వారా ఈ సేవల్ని బుక్‌ చేసుకోవచ్చని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు