కవిత కేసులో సుప్రీంకోర్టులో ఈడీ కెవియట్‌

భారాస ఎమ్మెల్సీ కవిత కేసులో తమ వాదనలు వినకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీచేయొద్దని కోరుతూ ఈడీ శుక్రవారం సుప్రీంకోర్టులో కెవియట్‌ దాఖలు చేసింది.

Updated : 19 Mar 2023 04:58 IST

తమ వాదనలు వినకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని విన్నపం

ఈనాడు, దిల్లీ: భారాస ఎమ్మెల్సీ కవిత కేసులో తమ వాదనలు వినకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీచేయొద్దని కోరుతూ ఈడీ శుక్రవారం సుప్రీంకోర్టులో కెవియట్‌ దాఖలు చేసింది. దిల్లీ మద్యం కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ ఇచ్చిన సమన్లను కొట్టేయాలని కోరుతూ కవిత 14న సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈడీ సమన్ల మేరకు 16న తాను ఆ సంస్థ ముందు హాజరుకావాల్సి ఉన్నందున అత్యవసరంగా విచారణ చేపట్టాలని 15న సీజేఐ ధర్మాసనం ముందు మెన్షన్‌ చేశారు. అత్యవసర విచారణకు.. సీజేఐ తిరస్కరిస్తూ విచారణను ఈ నెల 24కి వాయిదా వేశారు. అనంతరం 16న ఈడీ ముందు విచారణకు హాజరుకాని కవిత.. తన రిట్‌పిటిషన్‌ సుప్రీంలో పెండింగ్‌లో ఉన్నందున తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ వేచిచూడాలని ఈడీకి లేఖ రాశారు. ఆ లేఖను పరిగణనలోకి తీసుకోని ఈడీ.. ఈ నెల 20న ఆమెను మరోసారి విచారణకు పిలిచింది. సుప్రీంకోర్టులో సైతం కెవియట్‌ దాఖలు చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు