ఇద్దరు డీఈఓలకు జాతీయ పురస్కారం

రాష్ట్రానికి చెందిన ఇద్దరు డీఈఓలు జాతీయస్థాయి పురస్కారాలను గెలుచుకున్నారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా విద్యాశాఖాధికారిణి ఐ.విజయకుమారి, మెదక్‌ జిల్లా విద్యాశాఖాధికారి డి.రాధాకిషన్‌లు ఈ పురస్కారాలను దక్కించుకున్నారు.

Published : 19 Mar 2023 03:05 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రానికి చెందిన ఇద్దరు డీఈఓలు జాతీయస్థాయి పురస్కారాలను గెలుచుకున్నారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా విద్యాశాఖాధికారిణి ఐ.విజయకుమారి, మెదక్‌ జిల్లా విద్యాశాఖాధికారి డి.రాధాకిషన్‌లు ఈ పురస్కారాలను దక్కించుకున్నారు. కరోనా సమయంలో విద్యార్థుల కోసం తీసుకొచ్చిన అత్యంత ప్రభావితమైన ఇన్నోవేషన్‌లకు కేంద్ర విద్యాశాఖ, ఎన్‌సీఈఆర్‌టీ/ఎన్‌ఐఈపీఏ జాతీయస్థాయిలో విద్యాశాఖ అధికారులకు పురస్కారాలను అందజేస్తాయి. లాక్‌డౌన్‌ సమయంలో మేడ్చల్‌ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం మేడ్చల్‌ బడి డాట్‌కాం వెబ్‌సైట్‌ను విజయకుమారి అందుబాటులోకి తీసుకువచ్చారు. సిరిసిల్ల డీఈఓగా రాధాకిషన్‌ పనిచేసిన సమయంలో ఆ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సీఎస్‌ఆర్‌ కార్యక్రమాల కింద మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఎన్‌రోల్‌మెంట్‌ను పెంపొందించారు. ఈ కార్యక్రమాలు ఆయన పురస్కారం పొందడానికి దోహదం చేశాయి. వీరిద్దరూ ఈనెల 23న దిల్లీలో జరగనున్న కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకోనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని