చూపు లేకున్నా.. చదువులతో ‘ఉష’స్సు

పుట్టుకతో కంటిచూపు లేకున్నా ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు అన్నాచెల్లెళ్లు గుర్రం శ్రీనివాసరావు, ఉష. వీరి తండ్రి చనిపోగా.. తల్లి శేషమ్మతో కలిసి ఖమ్మం జిల్లా కేంద్రంలోని జయనగర్‌లో నివాసం ఉంటున్నారు.

Published : 19 Mar 2023 03:05 IST

పుట్టుకతో కంటిచూపు లేకున్నా ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు అన్నాచెల్లెళ్లు గుర్రం శ్రీనివాసరావు, ఉష. వీరి తండ్రి చనిపోగా.. తల్లి శేషమ్మతో కలిసి ఖమ్మం జిల్లా కేంద్రంలోని జయనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఎంఏ, బీఈడీ చదివిన ఉష 2013లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం మామిళ్లగూడెం ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. బ్రెయిలీ లిపిలో ప్రచురితమైన పుస్తకాల ఆధారంగా పాఠాలు బోధిస్తున్నారు. బోర్డుపై రాసేందుకు సహాయకురాలిని నియమించుకున్నారు. బీఏ చదివిన శ్రీనివాసరావు యూనియన్‌ బ్యాంకులో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం ఇల్లెందు చౌరస్తాలోని బ్రాంచిలో పనిచేస్తున్నారు.

ఈనాడు, ఖమ్మం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని