రుణాలు చెల్లించలేదని.. ఇంటి తలుపులు తీసేశారు!

రుణాలు చెల్లించలేదని దుర్కి సహకార కేంద్ర బ్యాంకు సిబ్బంది ఓ రైతు ఇంటి తలుపులను తీసేశారు. మరో రైతు ద్విచక్ర వాహనాన్ని, ఇంకో రైతు ఇంట్లో ల్యాప్‌టాప్‌, సామగ్రిని స్వాధీనం చేసుకొన్నారు.

Updated : 19 Mar 2023 03:44 IST

బీర్కూర్‌, న్యూస్‌టుడే: రుణాలు చెల్లించలేదని దుర్కి సహకార కేంద్ర బ్యాంకు సిబ్బంది ఓ రైతు ఇంటి తలుపులను తీసేశారు. మరో రైతు ద్విచక్ర వాహనాన్ని, ఇంకో రైతు ఇంట్లో ల్యాప్‌టాప్‌, సామగ్రిని స్వాధీనం చేసుకొన్నారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌ మండలం అంకోల్‌కు చెందిన చుంచు హన్మాండ్లు దుర్కి సహకార కేంద్ర బ్యాంకులో రూ.5 లక్షల రుణం తీసుకున్నారు. నాలుగు వాయిదాలు చెల్లించగా.. మరో 6 వాయిదాలు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శనివారం అంకోల్‌కు వెళ్లిన బ్యాంకు అధికారులు, సొసైటీ కార్యదర్శులు, సిబ్బంది వాయిదాలు ఎందుకు చెల్లించడం లేదని రైతులను నిలదీశారు. అనంతరం బ్యాంకు సిబ్బంది హన్మాండ్లు ఇంటి తలుపులను తొలగించి వాహనంలో పెట్టుకున్నారు. పసుపుల లక్ష్మణ్‌ కుమారుడి ల్యాప్‌టాప్‌, పసుపుల సాయయ్య కుమారుడి ద్విచక్ర వాహనాలను తీసుకుని వాహనాల్లో వేశారు. గంట తర్వాత ఓ రైతు రూ.50 వేలు, మరో రైతు రూ.20 వేలు చెల్లించడంతో అధికారులు ల్యాప్‌ టాప్‌, ద్విచక్రవాహనాన్ని తిరిగి ఇచ్చారు. హన్మాండ్లు వేడుకోగా తలుపులు ఇచ్చారు. మంగళవారం నగదు కట్టకపోతే తలుపులు, సామగ్రిని తీసుకెళ్తామని బ్యాంకు అధికారులు హెచ్చరించి వెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని