దిల్లీ చేరిన ఎమ్మెల్సీ కవిత

భారాస ఎమ్మెల్సీ కవిత సోమవారం ఈడీ ముందు హాజరవుతారా? లేదా? అనే విషయమై ఉత్కంఠ నెలకొంది.

Updated : 20 Mar 2023 05:46 IST

వెంట వెళ్లిన మంత్రి కేటీఆర్‌

ఈనాడు, దిల్లీ: భారాస ఎమ్మెల్సీ కవిత సోమవారం ఈడీ ముందు హాజరవుతారా? లేదా? అనే విషయమై ఉత్కంఠ నెలకొంది. మంత్రి కేటీఆర్‌, భర్త అనిల్‌, ఎంపీలు సంతోష్‌, వద్దిరాజు రవిచంద్ర, అదనపు అడ్వకేట్‌ జనరల్‌ రామచంద్రరావులతో కలిసి ఆమె ప్రత్యేక విమానంలో ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి దిల్లీ చేరుకున్నారు. కవిత ఈ నెల 16వ తేదీన ఈడీ ముందు హాజరుకావాల్సి ఉన్నా తన ప్రతినిధిని మాత్రమే పంపారు. తాను దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ నెల 24న సుప్రీంకోర్టు విచారించనుందని, న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు జారీచేసేవరకు వేచిచూడాలని ఆమె ఈ నెల 16న లేఖ ద్వారా ఈడీకి విజ్ఞప్తి చేశారు. కానీ ఈడీ 20వ తేదీన హాజరుకావాలని ఆమెకు మరోసారి సమన్లు జారీచేసింది. ఈ నేపథ్యంలో ఆమె గతంలో తాను రాసిన లేఖకే కట్టుబడి ఉంటారా? లేదంటే ఈడీ ముందు హాజరవుతారా? అన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. ఆమె హాజరైతే ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా, అరుణ్‌ రామచంద్రపిళ్లైలతో కలిపి విచారిస్తారని ప్రచారం జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు