తెలంగాణ ఉద్యోగులకు దేశంలోనే అత్యధిక వేతనాలు

దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు అత్యధిక వేతనాలను ఇస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

Published : 20 Mar 2023 03:36 IST

సెర్ప్‌ ఉద్యోగులతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు అత్యధిక వేతనాలను ఇస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) ఉద్యోగుల దీర్ఘకాలిక ఆకాంక్షను సీఎం కేసీఆర్‌ నెరవేర్చినందున వారు మరింత అంకితభావంతో పనిచేయాలని ఆమె సూచించారు. కొత్త పేస్కేల్‌ అమలుకు ఉత్తర్వుల జారీ చేయడంపై సెర్ప్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగాధర్‌రెడ్డి, ఇతర ప్రతినిధులు ఆదివారం కవితను ఆమె నివాసంలో కలిసి కృతజ్ఞతలు చెప్పారు. కవిత వారికి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. సెర్ప్‌ ఉద్యోగులు రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు చేయూతనివ్వాలని కోరారు. సెర్ప్‌ జిల్లాల ఉద్యోగ సంఘాల నేతలు మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లను వారి నివాసాల్లో కలిసి ధన్యవాదాలు తెలిపారు. కాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదివారం దేవరుప్పులలో సెర్ప్‌ ఉద్యోగులతో కలిసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని