వరి పొలంలో భారీ మొసలి

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్‌ పంట పొలాల్లో ఓ భారీ మొసలి కనిపించగా బంధించి జూరాల ప్రాజెక్టులో వదిలేశారు.

Updated : 20 Mar 2023 04:51 IST

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్‌ పంట పొలాల్లో ఓ భారీ మొసలి కనిపించగా బంధించి జూరాల ప్రాజెక్టులో వదిలేశారు. వెల్టూర్‌కు చెందిన బాల్‌రెడ్డి ఆదివారం ఉదయాన్నే.. గ్రామ సమీపంలోని చెరువు వెనుక సాగుచేసిన వరి పొలాన్ని చూసేందుకు వెళ్లారు. గట్టుపై నడుస్తుండగా పెద్ద మొసలి కనిపించింది. ఆయన అలికిడితో అది పక్కనే ఉన్న గ్రామ సర్పంచి శ్రీనివాస్‌రెడ్డి పొలంలోని గుంతలోకి వెళ్లిపోయింది. విషయాన్ని బాల్‌రెడ్డి సర్పంచికి చెప్పడంతో ఆయన వనపర్తిలోని ‘సాగర్‌ స్నేక్‌ సొసైటీ’ నిర్వాహకుడు, హోమ్‌గార్డు కృష్ణాసాగర్‌కు సమాచారమిచ్చారు. గ్రామానికి చేరుకున్న కృష్ణాసాగర్‌ మొసలిని బంధించేందుకు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. ఈ క్రమంలో ఓ పొక్లెయిన్‌ను తెప్పించి దాని సాయంతో మొసలిని బయటకు తీశారు. ఎస్సై హరిప్రసాద్‌, పోలీసు సిబ్బంది, గ్రామస్థుల సహకారంతో దాన్ని తాళ్లతో బంధించారు. అటవీశాఖ అధికారుల ఆదేశాల మేరకు మొసలిని జూరాల ప్రాజెక్టు నీటిలో వదిలేశారు.

 న్యూస్‌టుడే, పెద్దమందడి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని