సింగపూర్‌ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్‌రెడ్డి

సింగపూర్‌ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడిగా మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం మల్లంపేట గ్రామానికి చెందిన పుల్లన్నగారి శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికయ్యారు.

Published : 20 Mar 2023 04:39 IST

పాపన్నపేట, న్యూస్‌టుడే: సింగపూర్‌ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడిగా మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం మల్లంపేట గ్రామానికి చెందిన పుల్లన్నగారి శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికయ్యారు. మార్చి 5వ తేదీన సింగపూర్‌ తెలుగు సమాజం ఎన్నికలు నిర్వహించారు. ఆదివారం ఫలితాలు వెల్లడించారని, శ్రీనివాస్‌రెడ్డి ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన పదిహేనేళ్లుగా సింగపూర్‌ సిటీ బ్యాంకులో ఉన్నత హోదాలో విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు