తెలంగాణ యువత సవాళ్లు ఎదుర్కొంటోంది

‘తెలంగాణ యువత అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. వీటిని అధిగమించి, విజయం సాధించే ధైర్యం వారికి ఉందని నేను భావిస్తున్నా.. రాజ్‌భవన్‌ మీ వెంట ఉంది’ అని గవర్నర్‌ తమిళిసై అన్నారు.

Published : 21 Mar 2023 04:14 IST

యువ ఉగాది ఉత్సవాల్లో గవర్నర్‌ తమిళిసై

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: ‘తెలంగాణ యువత అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. వీటిని అధిగమించి, విజయం సాధించే ధైర్యం వారికి ఉందని నేను భావిస్తున్నా.. రాజ్‌భవన్‌ మీ వెంట ఉంది’ అని గవర్నర్‌ తమిళిసై అన్నారు. సోమవారం రాత్రి రాజ్‌భవన్‌లో శోభకృత్‌ నామ సంవత్సర ‘యువ ఉగాది ఉత్సవాలు’ ఘనంగా నిర్వహించారు. గవర్నర్‌ మాట్లాడుతూ.. యువత బలిదానాలతోనే రాష్ట్రం సిద్ధించిందని పేర్కొన్నారు. రాజ్‌భవన్‌ సీపీఆర్‌ ఛాలెంజ్‌, రక్తదాన శిబిరాలు, గిరిజన సంక్షేమం వంటి సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతోందన్నారు. యువత రాజ్‌భవన్‌ కార్యక్రమాల్లో భాగస్వాములవ్వాలని కోరారు. ఆత్మనిర్భర్‌ భారత్‌, స్వచ్ఛభారత్‌ వంటివి ముందుకు తీసుకెళ్లాలని, ప్రధాని కోరినట్లుగా దేశాభివృద్ధికి సహకరించాలని యువతకు సూచించారు. కార్యక్రమంలో భాగంగా శ్రీనివాస ధీరేంద్ర కౌశిక్‌ పంచాంగ పఠనం చేశారు. కళాకారుల నృత్యప్రదర్శన ఆకట్టుకుంది. 13 మంది నృత్య కళాకారులు, వివిధ సామాజిక సేవలు చేసిన యువతకు గవర్నర్‌ ఉగాది పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ దంపతులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. పురస్కారాలు అందుకున్న వారిలో.. రేపల్లి శ్రీనివాస్‌, కొండ సచ్‌దేవ్‌, విఘ్నేశ్‌ అర్జున్‌, గంధం సంతోష్‌, తిమ్మనోళ్ల రఘునాథ్‌రెడ్డి, రవికుమార్‌ సాగర్‌, శుభశ్రీ సాహు, జూనియ ఎవెలిన్‌, కాట్రగడ్డ హిమాన్సీ, రోహిణి కందాల, సాగి శివ శ్రీనివాస ధీరేంద్ర కౌశిక్‌, పోతుకుచి సోమసుందర, జ్యోత్స్న విక్కిరాల ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు