ఒకే పేరు... 38 బ్యాంకు ఖాతాలు!.. బాధితుడికి తెలియకుండానే ఆన్‌లైన్‌లో అకౌంట్లు
వారిద్దరి పేర్లు ఒకటే. తల్లిదండ్రులు, మండలాల పేర్లు మాత్రం వేరు. బ్యాంకర్లు వీటిని సరిచూసుకోకుండానే ఒకరికి రుణం ఇచ్చేయడం ఓ సామాన్యుడికి తిప్పలు తెచ్చిపెట్టింది.
మరో బ్యాంకులో రూ.1.24 లక్షల రుణం
పెద్దేముల్, న్యూస్‌టుడే: వారిద్దరి పేర్లు ఒకటే. తల్లిదండ్రులు, మండలాల పేర్లు మాత్రం వేరు. బ్యాంకర్లు వీటిని సరిచూసుకోకుండానే ఒకరికి రుణం ఇచ్చేయడం ఓ సామాన్యుడికి తిప్పలు తెచ్చిపెట్టింది. ఇది చాలదన్నట్లు పాన్, రేషన్ కార్డులతో ఎవరో అతని పేరిట 38 బ్యాంకు ఖాతాలు తెరవడంతో బాధితుడు హతాశుడయ్యారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుడు తెలిపిన ప్రకారం... పెద్దేముల్‌కు చెందిన మంగలి అనంతయ్య ఇటీవల ఇంటి నిర్మాణం ప్రారంభించారు. రుణం కోసం బ్యాంకుల చుట్టూ తిరిగారు. ఎక్కడా అప్పు పుట్టకపోవడంతో వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు బ్యాంకును ఆశ్రయించారు. వారు అనంతయ్య ఆధార్, పాన్ కార్డుల ద్వారా వివరాలు సేకరించారు. వికారాబాద్‌లోని కెనరా బ్యాంకులో ద్విచక్ర వాహనం కోసం రూ.1.24 లక్షల అప్పు తీసుకున్నట్లు తేలింది. దీనికితోడు అతని పేరిట 38 ఆన్‌లైన్ బ్యాంకు ఖాతాలు ఉన్నాయని తెలిపారు. దాంతో బిత్తరపోయిన బాధితుడు కెనరా బ్యాంకు అధికారులను ఆశ్రయించి వివరాలు అడిగారు. నవాబుపేట మండలం పులుమద్ది గ్రామానికి చెందిన మంగలి అనంతయ్య అనే పేరున్న మరో వ్యక్తి అప్పు తీసుకున్నట్లు గుర్తించారు. ఇద్దరి పేర్లు ఒకటే అయినా తండ్రుల పేర్లు మాత్రం వేరు. రూ.1.24 లక్షల అప్పు తీసుకున్న వ్యక్తి తండ్రి బక్కయ్య. బ్యాంకులో పెద్దేముల్ అనంతయ్యకు చెందిన పాన్, రేషన్‌కార్డులు, పులుమద్ది అనంతయ్యకు చెందిన ఆధార్, ఓటరు కార్డులు ఉన్నాయి. అంతేకాదు గుర్తుతెలియని వ్యక్తులు పెద్దేముల్ అనంతయ్య పేరిట 38 ఆన్‌లైన్ ఖాతాలను తెరిచి 26 ఖాతాలను మూసేశారు. 12 మాత్రం కొనసాగుతున్నాయి. తీవ్ర ఆందోళనకు గురైన పెద్దేముల్ అనంతయ్య, ఆయన భార్య శ్యామల ఇద్దరూ సోమవారం ఎస్సై అన్వేష్‌రెడ్డికి తమ సమస్య విన్నవించారు. ఫిర్యాదు తీసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Nayanthara: ఆనాడు దర్శకుడికి కోపం తెప్పించిన నయనతార.. ‘నువ్వు రావొద్దు’ అని చెప్పేసిన డైరెక్టర్
-
Crime News
Hyderabad: టీచర్, రాజేశ్ చనిపోవాలనుకున్నారు?.. పోలీసుల చేతికి కీలక ఆధారాలు
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
TSPSC: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో 13 మంది డిబార్
-
Crime News
Nellore: భర్త అంత్యక్రియలు ముగిసిన కొన్ని గంటలకే భార్య మృతి
-
Viral-videos News
Viral Video: ఇదేం వెర్రో..? రన్నింగ్ కారుపై పుష్ అప్స్ తీస్తూ యువకుడి హల్చల్!