రేణుక, ఢాక్యాల సస్పెన్షన్‌

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీలో నిందితులుగా ఉన్న రేణుక, ఆమె భర్త ఢాక్యానాయక్‌లను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. రేణుక వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం బుద్దారం పరిధిలోని బాలికల గురుకుల ఎస్సీ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది.

Published : 21 Mar 2023 04:13 IST

మహబూబ్‌నగర్‌, ఈనాడు డిజిటల్‌: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీలో నిందితులుగా ఉన్న రేణుక, ఆమె భర్త ఢాక్యానాయక్‌లను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. రేణుక వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం బుద్దారం పరిధిలోని బాలికల గురుకుల ఎస్సీ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ప్రశ్నపత్రం లీకేజీలో ఆమెపై ఆరోపణలు రావడంతో ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి రొనాల్డ్‌ రోస్‌కు పాఠశాల ప్రిన్సిపల్‌ మెయిల్‌ ద్వారా నివేదిక పంపారు. దాని ఆధారంగా రేణుకను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఆమె భర్త ఢాక్యానాయక్‌ వికారాబాద్‌ జిల్లా కుల్కచర్ల మండలం ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ సాంకేతిక సహాయకుడిగా పనిచేస్తున్నాడు. ఆయనకు షోకాజ్‌ నోటీసు జారీ చేస్తూ.. విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల కాపీని ఆయన స్వగ్రామమైన మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ మండలం పంచలింగాలలోని ఇంటి వద్ద అతికించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని