ఏపీ హైకోర్టులో ఉగాది వేడుకలు

ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం హైకోర్టులో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Published : 22 Mar 2023 04:57 IST

హాజరైన సీజే, న్యాయమూర్తులు

ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం హైకోర్టులో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు హాజరై నూతన పంచాంగాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.జానకిరామిరెడ్డి, ఉపాధ్యక్షుడు పీఎస్పీ సురేశ్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి వి.సాయికుమార్‌, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

ఈనాడు, అమరావతి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని