దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్న సీఎం కేసీఆర్‌

రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో పర్యటించనున్నారు.

Updated : 23 Mar 2023 03:07 IST

నేడు ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో పర్యటన

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో పర్యటించనున్నారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి.. ముందుగా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బోనకల్‌ మండలంలోని రామాపురం గ్రామాన్ని చేరుకుంటారు. అక్కడ తీవ్రంగా దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను పరిశీలించి, నష్టపోయిన రైతులతో ముఖ్యమంత్రి మాట్లాడతారు. అనంతరం మహబూబాబాద్‌ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని పెద్దవంగర మండలానికి చేరుకుంటారు. ఈ మండలంలోని రెడ్డికుంట తండాలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో సంభాషిస్తారు. అక్కడి నుంచి వరంగల్‌ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలంలోని అడవి రంగాపురం గ్రామాన్ని సందర్శిస్తారు. పంట నష్టపోయిన రైతులతో నేరుగా మాట్లాడతారు. అనంతరం కరీంనగర్‌ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం లక్ష్మీపురం చేరుకుంటారు. అక్కడి నుంచి రామచంద్రాపూర్‌ గ్రామానికి వెళ్లి పంటలను పరిశీలిస్తారు. రైతులను పరామర్శించి వారికి భరోసా కల్పించనున్నారు. తిరిగి సాయంత్రం ముఖ్యమంత్రి హైదరాబాద్‌ చేరుకుంటారు. సీఎం కేసీఆర్‌ పర్యటన ఖరారు కావడంతో ఆయా జిల్లాల్లో మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు