అరగంట వడగళ్ల వానతో.. రూ.అర కోటి నష్టం!

కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లో ఈ నెల 19న అరగంట పాటు కురిసిన వడగళ్ల వానతో పుచ్చకాయ తోట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.

Published : 23 Mar 2023 04:07 IST

రామడుగు, న్యూస్‌టుడే: కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లో ఈ నెల 19న అరగంట పాటు కురిసిన వడగళ్ల వానతో పుచ్చకాయ తోట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. రైతు ద్యావ రామచంద్రారెడ్డి పది ఎకరాల్లో సూర్యపుచ్చ పంట సాగుచేశారు. రంజాన్‌ మాసం డిమాండ్‌కు అనుగుణంగా మరో పది రోజుల్లో కోత చేపట్టి దిల్లీ మార్కెట్‌కు తరలించాల్సి ఉండగా.. వడగళ్ల వానతో పంట పూర్తిగా దెబ్బతిందని రైతు వాపోయారు. ఇప్పటికే రూ.15 లక్షల పెట్టుబడి పెట్టానని, ఎకరాకు రూ.5 లక్షల మేర ఆదాయం వచ్చేదని, ఇప్పుడు ఒక్క రూపాయి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరో 4 ఎకరాల్లో నాటిన డ్రాగన్‌, రెండెకరాల్లో పెంచుతున్న లిచి, ఆపిల్‌ మొక్కలు సైతం విరిగిపోయాయని వెల్లడించారు. ఈ రైతు వ్యవసాయ క్షేత్రాన్ని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ తదితరులు బుధవారం పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని