శ్రీరామనవమి వేడుకలకు శ్రీకారం

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో ఈ నెల 30, 31 తేదీల్లో నిర్వహించనున్న శ్రీరామనవమి, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం వేడుకలకు బుధవారం శ్రీకారం చుట్టారు.

Published : 23 Mar 2023 04:07 IST

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో ఈ నెల 30, 31 తేదీల్లో నిర్వహించనున్న శ్రీరామనవమి, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం వేడుకలకు బుధవారం శ్రీకారం చుట్టారు. తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని ఉగాది పచ్చడి పంచి.. మూలవిరాట్‌ వద్ద ఉత్సవ అనుజ్ఞ తీసుకున్నారు. ఓంకార ధ్వజారోహణ చేశారు. విష్వక్సేన పూజ, రక్షాబంధనం, వాస్తు హోమం నిర్వహించారు. సామూహిక సంక్షేప రామాయణ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. పంచాంగ పఠనం చేశారు. శ్రీరామనవమి ఉత్సవాల అంకురార్పణ సందర్భంగా పుట్టమట్టిని పూజించారు. తిరువీధి సేవలో సీతారాములవారు స్వర్ణ కల్పవృక్ష వాహనంలో భక్తులకు దర్శనమిచ్చాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని