ఈ హలం వినూత్నం...

రైతులు సులువుగా దున్నేలా పోర్టబుల్‌ కల్టివేషన్‌ మిషన్‌ను ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించిన అకడమిక్‌ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు.

Published : 23 Mar 2023 04:07 IST

ఈనాడు గుంటూరు: రైతులు సులువుగా దున్నేలా పోర్టబుల్‌ కల్టివేషన్‌ మిషన్‌ను ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించిన అకడమిక్‌ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు. దుక్కి దున్నడం, విత్తనం వేయడం, కలుపు తీయడం మందు చల్లడం ఏకకాలంలో చేసేలా ఈ పరికరాన్ని రూపొందించారు. నేల గట్టిగా ఉన్న ప్రాంతంలో సబ్‌మెర్సిబుల్‌ పంపు ద్వారా నీరు విడుదల కావడంతో అవలీలగా భూమి దున్నేయొచ్చు. రైతుకు ఉపకారిగా రూ.3 వేలలోపు ఖర్చుతో ఈ హలాన్ని తీర్చిదిద్దామని ఏఎన్‌యూ బీటెక్‌ మెకానికల్‌ విద్యార్థులు వంశీవర్ధన్‌, నవీన్‌, సాయిమహేష్‌ తెలిపారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని