తీన్మార్‌ మల్లన్నపై హత్యాయత్నం కేసు

క్యూన్యూస్‌ నిర్వాహకుడు చింతపండు నవీన్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్న, మరో ఏడుగురిపై మేడిపల్లి పోలీసులు మంగళవారం హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

Published : 23 Mar 2023 04:07 IST

మరో ఏడుగురిపైనా..

ఈనాడు- హైదరాబాద్‌, మేడిపల్లి, న్యూస్‌టుడే: క్యూన్యూస్‌ నిర్వాహకుడు చింతపండు నవీన్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్న, మరో ఏడుగురిపై మేడిపల్లి పోలీసులు మంగళవారం హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లను అపహరించి, నిర్బంధించి.. దాడి చేశారని, చట్టబద్ధ విధులు నిర్వహించకుండా అడ్డుకున్నారంటూ తీన్మార్‌ మల్లన్న, క్యూన్యూస్‌ ఎడిటర్‌ బండారు రవీందర్‌, డ్రైవర్‌ ఉప్పల నిఖిల్‌, సిర్రా సుధాకర్‌, చింతా సందీప్‌ కుమార్‌, రమణ్‌ హజారీ, చందు, అనిల్‌ తదితరులపై కేసు నమోదు చేశారు. మంగళవారం సాయంత్రం నాటకీయ పరిణామాల మధ్య అయిదుగురిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు. అనంతరం చర్లపల్లి జైలుకు రిమాండుకు తరలించారు. రమణ్‌ హజారీ, చందు, అనిల్‌ పరారీలో ఉన్నారు. ‘తీన్మార్‌ మల్లన్నపై రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 90 కేసులు నమోదయ్యాయి. రాచకొండలోనే అయిదు కేసులున్నాయి. సామాజిక మాధ్యమాలు, క్యూ న్యూస్‌ ఛానెల్‌లో తప్పుడు, ఉద్దేశపూర్వక వార్తలు ప్రసారం చేస్తున్నారు’ అని తీన్మార్‌ మల్లన్న అరెస్టు సందర్భంగా రిమాండు రిపోర్టులో మేడిపల్లి పోలీసులు ప్రస్తావించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు