భద్రాచలం ఉత్సవాలకు సీఎం, గవర్నర్‌లకు ఆహ్వానం

భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించనున్న నేపథ్యంలో రామాలయ ఈవో రమాదేవి, స్థానాచార్యులు స్థలసాయి.

Published : 23 Mar 2023 04:07 IST

భద్రాచలం, న్యూస్‌టుడే-ఈనాడు,హైదరాబాద్‌: భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించనున్న నేపథ్యంలో రామాలయ ఈవో రమాదేవి, స్థానాచార్యులు స్థలసాయి, ప్రధానార్చకులు సీతారామానుజాచార్యులు, ఆలయ అధికారులు బుధవారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని కలిశారు.ఏర్పాట్లపై వివరించారు. అనంతరం వీరంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాసానికి వెళ్లి స్వామివారి ప్రసాదాన్ని అందించి సత్కరించారు. కల్యాణ ఆహ్వాన పత్రికను అందించి 30న నిర్వహించే శ్రీరామ నవమి వేడుకలకు ఆహ్వానించారు. తర్వాత ఆలయ ఈవో ఆధ్వర్యంలో అధికారులు, అర్చకులు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి ఆహ్వాన పత్రం అందించారు. 31న పట్టాభిషేకం కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు