తెలుగు సంస్కృతిని భావితరాలకు అందించాలి

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడానికి అందరూ కృషి చేయాలని హాస్యబ్రహ్మ డా.శంకరనారాయణ కోరారు. అలాంటి కృషిని ‘ది ముంబయి ఆంధ్ర మహాసభ’ చేస్తూ..

Published : 23 Mar 2023 05:17 IST

ఉగాది వేడుకల్లో హాస్యబ్రహ్మ డా.శంకరనారాయణ

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడానికి అందరూ కృషి చేయాలని హాస్యబ్రహ్మ డా.శంకరనారాయణ కోరారు. అలాంటి కృషిని ‘ది ముంబయి ఆంధ్ర మహాసభ’ చేస్తూ.. ప్రపంచంలోని తెలుగువారందరికీ గర్వకారణంగా నిలుస్తోందని కొనియాడారు. బుధవారం రాత్రి ‘ది ముంబయి ఆంధ్ర మహాసభ’, జింఖానా, ధర్మకర్తల మండలి, కార్యవర్గం, మహిళాశాఖ సమర్పణలో ముంబయి దాదర్‌లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. శంకరనారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు కీర్తిస్తే...తాను ‘దేశభాషలందు తెలుగు తీపి’ అంటున్నానన్నారు. ఇందుకు కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ మాటలను ఉదహరించారు. అనంతరం హాస్యోక్తులతో సభికులను నవ్వించారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో పలువురు కవులు కవితలు చదివి ఆకట్టుకున్నారు. వారిని నగదు పురస్కారంతో సన్మానించారు. ది ముంబయి ఆంధ్ర మహాసభ సాహిత్య ఉపాధ్యక్షుడు, ప్రముఖ సాహితీవేత్త సంగవేని రవీంద్ర అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మహాసభ అధ్యక్షుడు సంకు సుధాకర్‌, ప్రధాన కార్యదర్శి వేముల మనోహర్‌, సంయుక్త కార్యదర్శి డా.జి.కృపేందర్‌, కోశాధికారి బింగి సత్యనారాయణ, ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ భోగ సహదేవుడు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు