44 మందికి తెలుగు వర్సిటీ ‘కీర్తి పురస్కారాలు’
తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో విశేష సేవలు అందించిన 44 మంది ప్రముఖులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2020 సంవత్సరానికి ‘కీర్తి పురస్కారాలు’ ప్రకటించింది.
నారాయణగూడ, న్యూస్‌టుడే: తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో విశేష సేవలు అందించిన 44 మంది ప్రముఖులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2020 సంవత్సరానికి ‘కీర్తి పురస్కారాలు’ ప్రకటించింది. వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడ కిషన్‌రావు అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను వీటికి ఎంపిక చేసింది. ఈ నెల 28, 29వ తేదీల్లో వర్సిటీలోని ఎన్టీఆర్ కళామందిరంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేశ్ వెల్లడించారు.
పురస్కారాలకు ఎంపికైనవారు..
డా.సముద్రాల వెంకటరంగ రామానుజాచార్యులు(ఆధ్యాత్మిక సాహిత్యం), పుత్తా పుల్లారెడ్డి(ప్రాచీన సాహిత్యం), డా.వి.వి.రామారావు(సృజనాత్మక సాహిత్యం), టి.వి.ప్రసాద్(కాల్పనిక సాహిత్యం), వారాల ఆనంద్(అనువాద సాహిత్యం), ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి(బాలసాహిత్యం), డా.ఎ.వి.వీరభద్రాచారి(వచన కవిత), కొరుప్రోలు మాధవరావు(తెలుగు గజల్), జి.వి.కృష్ణమూర్తి(పద్యరచన), డా.మాదిరాజు బ్రహ్మానందరావు(పద్యరచన), డా.పసునూరి రవీందర్(కథ), వేముల ప్రభాకర్(నవల), ఆర్.సి.కృష్ణస్వామిరాజు(హాస్యరచన), జి.భగీరథ(జీవిత చరిత్ర), తాళ్లపల్లి మురళీధర్‌గౌడ్(వివిధ ప్రక్రియలు), చిలువేరు రఘురాం(నాటక రచయిత), డా.వి.వి.వెంకటరమణ(జనరంజక విజ్ఞానం), ఎస్.వి.రామారావు(పరిశోధన), అన్నవరపు బ్రహ్మయ్య(పత్రికా రచన), రాళ్లపల్లి సుందర్‌రావు(భాష), ఘట్టమరాజు అశ్వత్థనారాయణ(సాహిత్య విమర్శ), కాటేపల్లి లక్ష్మీనరసింహమూర్తి(అవధానం), పి.వి.సాయిబాబా(లలిత సంగీతం), డా.కె.శేషులత(శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు), ఎం.డి.రజియా(జానపద కళారంగం), పస్తం కొమురమ్మ(జానపద కళలు), డా.పొనుగోటి సరస్వతి(ఉత్తమ రచయిత్రి), శైలజా మిత్ర(ఉత్తమ రచయిత్రి), నాగమణి(ఉత్తమ నటి), మాలెల అంజిలయ్య(ఉత్తమ నటుడు), ప్రొ.భాస్కర్ శివాల్కర్(నాటకరంగంలో కృషి), పేరిణి ప్రకాష్(పేరిణి), డా.రుద్రవరం సుధాకర్(కూచిపూడి నృత్యం), డా.గెల్లి నాగేశ్వరరావు(సంఘసేవ), పేరలింగం(హేతువాద ప్రచారం), బండారు విజయ(మహిళాభ్యుదయం), డా.ముదిగంటి సుధాకర్‌రెడ్డి(గ్రంథాలయ సమాచార విజ్ఞానం), ప్రొ.గజ్జల రామేశ్వరం(గ్రంథాలయకర్త), ఆకృతి సుధాకర్(సాంస్కృతిక సంస్థ నిర్వహణ), శ్యామ్(ఇంద్రజాలం), నారు(కార్టూనిస్టు), డా.ఎ.ఎస్.ఫణీంద్ర(జ్యోతిషం), ఎజాజ్ అహ్మద్(ఉత్తమ ఉపాధ్యాయుడు), ప్రొ.ప్రీతి సంయుక్త(చిత్రలేఖనం)
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Mahindra - Dhoni: ధోని రాజకీయాల గురించి ఆలోచించాలి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
-
India News
Shashi Tharoor: ‘వందే భారత్’ సరే.. కానీ సుదీర్ఘ ‘వెయిటింగ్’కు తెరపడేదెప్పుడు?
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Ahimsa: ఈ సినిమాలోనూ హీరో, హీరోయిన్ను కొట్టారా? విలేకరి ప్రశ్నకు తేజ స్ట్రాంగ్ రిప్లై!
-
General News
Weather Update: తెలంగాణలో మరో మూడు రోజులు మోస్తరు వర్షాలు
-
Crime News
Hyderabad: ఒక్క మిస్డ్ కాల్‌తో రెండు జీవితాలు బలి.. రాజేశ్ మృతి కేసులో కీలక ఆధారాలు