మద్నూర్‌-బోధన్‌ మధ్య ఎన్‌హెచ్‌-161బిబి విస్తరణ

కామారెడ్డి, నిజామాబాద్‌, నాందేడ్‌ మీదుగా వెళ్లే ఎన్‌హెచ్‌-161బిబిలో మద్నూర్‌-బోధన్‌ సెక్షన్‌ను రూ.429.28 కోట్లతో 2/4 వరుసలుగా విస్తరించడానికి ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ గురువారం ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

Updated : 24 Mar 2023 05:21 IST

రూ.429 కోట్లతో ఆమోదం

ఈనాడు, దిల్లీ: కామారెడ్డి, నిజామాబాద్‌, నాందేడ్‌ మీదుగా వెళ్లే ఎన్‌హెచ్‌-161బిబిలో మద్నూర్‌-బోధన్‌ సెక్షన్‌ను రూ.429.28 కోట్లతో 2/4 వరుసలుగా విస్తరించడానికి ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ గురువారం ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. 39.032 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టును ఈపీసీ విధానంలో అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు.

రూ.1,190.86 కోట్లతో రెమిడిచర్ల-జక్కంపూడి గ్రీన్‌ఫీల్డ్‌ హైవే..

ఎన్‌హెచ్‌-163జి (ఖమ్మం-విజయవాడ)లో రెమిడిచర్ల గ్రామం నుంచి జక్కంపూడి (ఎన్‌హెచ్‌-16) వరకు 4 వరుసల యాక్సెస్‌ కంట్రోల్డ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేని అభివృద్ధి చేస్తున్నట్లు గడ్కరీ తెలిపారు. 29.709 కిలోమీటర్ల ఈ మార్గం అభివృద్ధికి రూ.1,190.86 కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు వెల్లడించారు. నాగ్‌పుర్‌-విజయవాడ ఎకనామిక్‌ కారిడార్‌లో భాగంగా దీన్ని హైబ్రిడ్‌ యాన్యుటీ విధానంలో నిర్మిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని