మాగుంట రాఘవ్‌ బెయిల్‌ పిటిషన్‌ విచారణ రేపటికి వాయిదా

దిల్లీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న మాగుంట రాఘవ్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను ఇక్కడి రౌస్‌అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శనివారానికి(25వ తేదీ) వాయిదా వేసింది.

Published : 24 Mar 2023 03:55 IST

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న మాగుంట రాఘవ్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను ఇక్కడి రౌస్‌అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శనివారానికి(25వ తేదీ) వాయిదా వేసింది. దిల్లీ మద్యం కేసులో అరెస్టయి తిహాడ్‌ జైలులో ఉన్న వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవ్‌.. బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. సీబీఐ ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్‌ గురువారం దీనిపై విచారణ చేపట్టారు. పిటిషన్‌ విచారణకు వచ్చినప్పటికీ తిహాడ్‌ జైలు అధికారులు రాఘవ్‌ను వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరుపరచలేదు. దీంతో ప్రత్యేక జడ్జి  జైలు సూపరింటెండెంట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రాఘవ్‌ను శనివారం వీసీ ద్వారా హాజరుపరచాలని ఆదేశిస్తూ విచారణను ఆ రోజుకు వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని