మరో 1.20 లక్షల టన్నుల శనగ సేకరణ

తెలంగాణలో ప్రస్తుత యాసంగి సీజన్‌లో పండించిన శనగ పంటను కేంద్రం నిర్దేశించిన దాని కంటే అదనంగా 1,20,308 మెట్రిక్‌ టన్నులను మద్దతు ధరతో సేకరించాలని మార్క్‌ఫెడ్‌ను ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం.

Updated : 24 Mar 2023 05:24 IST

కేంద్రం అనుమతించింది 50,328 టన్నులే
మద్దతు ధరతో అదనపు సేకరణ
మార్క్‌ఫెడ్‌కు ప్రభుత్వ ఆదేశాలు
రూ. 702 కోట్ల రుణ సాయానికి బ్యాంక్‌ గ్యారంటీ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ప్రస్తుత యాసంగి సీజన్‌లో పండించిన శనగ పంటను కేంద్రం నిర్దేశించిన దాని కంటే అదనంగా 1,20,308 మెట్రిక్‌ టన్నులను మద్దతు ధరతో సేకరించాలని మార్క్‌ఫెడ్‌ను ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు (జీవో 128) జారీ చేసింది. దీని కోసం రూ.702 కోట్లను బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుంచి రుణంగా తీసుకోవాలని సూచిస్తూ, దానికి బ్యాంకు గ్యారంటీ ఇస్తామని తెలిపింది. ఈ సీజన్‌లో రాష్ట్రంలో కేవలం 50,328 టన్నులనే సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఇది చాలా తక్కువగా ఉండటంతో రాష్ట్రంలో పండించిన మొత్తం పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని శనగ రైతులు, ప్రజాప్రతినిధులు అభ్యర్థించారు. ఈ మేరకు మార్క్‌ఫెడ్‌ ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపించింది. దీనిని ప్రభుత్వం పరిగణనలోనికి తీసుకొని చిన్నకారు, సన్నకారు శనగ రైతులను ఆదుకునేందుకు గాను మొత్తం శనగ పంటను సేకరించాలని నిర్ణయించింది. తాజాగా అనుమతించిన దాంతో కలిసి రాష్ట్రంలో ఈ సీజన్‌లో  మొత్తంగా 1.70 లక్షల టన్నుల శనగను సేకరించాలని మార్క్‌ఫెడ్‌ను ఆదేశించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు