ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో తాజా స్థితిని నివేదించండి

ప్రశ్నపత్రాల లీకేజీ కేసుకు సంబంధించిన తాజా స్థితిపై నివేదిక సమర్పించాలని గవర్నర్‌ తమిళిసై.. సీఎస్‌, డీజీపీ, టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్లను ఆదేశించారు.

Updated : 24 Mar 2023 05:31 IST

సీఎస్‌, డీజీపీ, టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్లకు గవర్నర్‌ ఆదేశాలు

ఈనాడు, హైరదాబాద్‌: ప్రశ్నపత్రాల లీకేజీ కేసుకు సంబంధించిన తాజా స్థితిపై నివేదిక సమర్పించాలని గవర్నర్‌ తమిళిసై.. సీఎస్‌, డీజీపీ, టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్లను ఆదేశించారు. సిట్‌ దర్యాప్తులో వెల్లడైన తాజా అంశాలు, కమిషన్‌ అనుమతితో లేదా అనుమతి లేకుండా పరీక్షలకు హాజరైన ఆ సంస్థ రెగ్యులర్‌, పొరుగు సేవల ఉద్యోగుల వివరాలు, పరీక్షల్లో వారి ఫలితాల వివరాలను అందజేయాలని తెలిపారు. కేసు ప్రస్తుత స్థితితో సంబంధం లేకుండా టీఎస్‌పీఎస్సీ పరీక్షల నిర్వహణ, సన్నాహకాల్లో ఉద్యోగుల పనితీరు తదితర అంశాలపైనా వివరాలను అందించాలని గవర్నర్‌ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు