సమయం సద్వినియోగమైతేనే ప్రగతి
కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ జీవితంలో ముందుకు సాగాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా.కేవీ రమణాచారి కోరారు. వంశీ ఆర్ట్ థియేటర్స్-ఇంటర్నేషనల్, వంశీ కల్చరల్, ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌ల ఆధ్వర్యంలో..
ప్రభుత్వ సలహాదారు రమణాచారి
గాంధీనగర్, న్యూస్‌టుడే: కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ జీవితంలో ముందుకు సాగాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా.కేవీ రమణాచారి కోరారు. వంశీ ఆర్ట్ థియేటర్స్-ఇంటర్నేషనల్, వంశీ కల్చరల్, ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌ల ఆధ్వర్యంలో గురువారం రాత్రి త్యాగరాయ గానసభలో వంశీ శుభోదయం శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రామాయణ సుధానిధి డా.మైలవరపు శ్రీనివాసరావు, డా.మైలవరపు సుబ్బలక్ష్మిలకు వేద ఉగాది పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఇందులో భాగంగా పది జంటలకు ఆదర్శ దంపతుల అవార్డులను అందజేశారు. కిమ్స్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డా.బొల్లినేని భాస్కరరావుకు పద్మశ్రీ డా.కాకర్ల సుబ్బారావు పురస్కారం, ‘ఈనాడు’ దినపత్రిక ఏపీ సంపాదకులు ఎం.నాగేశ్వరరావుకు నార్ల వెంకటేశ్వరరావు పురస్కారం, శంకరాభరణం నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కుమారులు ఏడిద శ్రీరామ్, ఏడిద రాజాలకు కె.విశ్వనాథ్ పురస్కారం, చిత్రకారుడు బ్నింకు దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి పురస్కారం అందజేశారు. వర్ధమాన రచయితలు శ్రీ ఊహ, ఉమామహేష్ ఆచాళ్ల, సురేంద్ర శీలం, నాగేంద్రకాశీకి ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ స్వర్ణ పతకాలను బహూకరించారు. చక్కటి కథాంశాలను తీసుకొని వారు పుస్తకాలు రాస్తున్నారని ప్రస్తుతించారు. ప్రముఖ సాహితీవేత్త ఓలేటి పార్వతీశం అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఎం.నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏ నగర గొప్పదనమైనా ఎత్తయిన భవనాలు, విశాలమైన రహదారుల కంటే అక్కడ సంగీత, సాహిత్య, సాంస్కృతిక వైభవంలోనే బాగా తెలుస్తుందన్నారు. కళల వికాసానికి కృషి చేస్తున్న వంశీ సంస్థను ఆయన అభినందించారు. కిమ్స్ ఛైర్మన్ బొల్లినేని కృష్ణయ్య, సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, తిరుమల బ్యాంక్ సీఎండీ నంగునూరి చంద్రశేఖర్, శుభోదయం గ్రూప్ సీఎండీ డా.లక్ష్మీప్రసాద్, వంశీ సంస్థల వ్యవస్థాపకులు డా.వంశీ రామరాజు, ప్రముఖులు వంశీ, తరంగిణి, చంద్రకాంతసాగర్, తెన్నేటి సుధాదేవి, కేతరపు రాజ్యశ్రీ, సుంకరపల్లి శైలజ, మంగిపూడి రాధిక తదితరులు పాల్గొన్నారు. డా.మైలవరపు శ్రీనివాసరావు పంచాంగ పఠనం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Polavaram project: 2025 జూన్ నాటికి పోలవరం పూర్తి చేయాలని లక్ష్యం
-
Politics News
CM Jagan-Balineni: సీఎం జగన్‌తో బాలినేని భేటీ.. నేతల మధ్య విభేదాలపై చర్చ
-
World News
Sudan: ఆకలికి తట్టుకోలేక 60 మంది చిన్నారులు మృతి.. పాలు లేక నీళ్లు తాగిస్తున్న దృశ్యాలు..!
-
General News
Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
Viveka Murder case: సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన భాస్కర్‌రెడ్డి
-
World News
Vivek: చైనాలో ఎలాన్ మస్క్ పర్యటన ఆందోళనకరమే : వివేక్ రామస్వామి