సాగు భూముల క్రయవిక్రయాలతో ఖజానా గలగల

సాగు భూముల క్రయవిక్రయాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు రాబడి మెరుగ్గా ఉంది. గురువారం నాటికి ఈ ఆదాయం రూ.1970 కోట్లకు చేరుకోగా, ఈ నెలాఖరు నాటికి రూ.2 వేల కోట్లు దాటనుందని అంచనా వేస్తున్నారు.

Published : 24 Mar 2023 05:27 IST

ఈ నెలాఖరుకు రూ.2 వేల కోట్లు దాటనున్న ఆదాయం

ఈనాడు, హైదరాబాద్‌: సాగు భూముల క్రయవిక్రయాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు రాబడి మెరుగ్గా ఉంది. గురువారం నాటికి ఈ ఆదాయం రూ.1970 కోట్లకు చేరుకోగా, ఈ నెలాఖరు నాటికి రూ.2 వేల కోట్లు దాటనుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో 2020 నవంబరు 2 నుంచి ధరణి పోర్టల్‌ ద్వారా సాగు భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, భాగపంపిణీ, గిఫ్ట్‌ డీడ్‌, ఫౌతీ (వారసత్వ బదిలీ) తదితర సేవలు నిర్వహిస్తున్నారు. తహసీల్దారు - సంయుక్త సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈ సేవలు అందుతున్నాయి. అంతకుముందు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ (కార్డ్‌) ఆధ్వర్యంలో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల ద్వారా ఈ సేవలు అందేవి.

8.86 లక్షల లావాదేవీలు..

వ్యవసాయ భూములకు సంబంధించి 2021-22లో 8.32 లక్షల లావాదేవీల ద్వారా రూ.1760.55 కోట్ల నికర రాబడి రాగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో గురువారం నాటికి 8.88 లక్షల లావాదేవీల ద్వారా రూ.1970 కోట్ల ఆదాయం వచ్చింది. వీటిలో రిజిస్ట్రేషన్లు-మ్యుటేషన్లు 7.23 లక్షలు, వారసత్వ బదిలీ 92,125, భాగపంపిణీ 14,420, వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్పిడి (నాలా) లావాదేవీలు 57,038 ఉన్నాయి. రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కరీంనగర్‌, ఖమ్మం తదితర జిల్లాలు రాబడిలో ముందున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు