2025 నాటికి క్షయ నిర్మూలన

తెలంగాణలో 2025 నాటికి క్షయ నిర్మూలన లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Updated : 25 Mar 2023 05:33 IST

4 జిల్లాలకు జాతీయ అవార్డులు: మంత్రి హరీశ్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో 2025 నాటికి క్షయ నిర్మూలన లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్షయ నియంత్రణలో కృషి చేసి జాతీయ స్థాయిలో అవార్డులు పొందిన జిల్లాల అధికారులు, సిబ్బందిని మంత్రి అభినందించారు.

నిజామాబాద్‌కు బంగారు పతకం

క్షయ నియంత్రణలో ప్రతిభ కనబరిచిన రాష్ట్రంలోని 4 జిల్లాలకు కేంద్రం అవార్డులు అందజేసింది. ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో శుక్రవారం జరిగిన జాతీయ స్థాయి కార్యక్రమంలో తెలంగాణ టీబీ విభాగం అధికారులు ఈ అవార్డులను అందుకున్నారు. టీబీ కేసుల తగ్గింపులో మొదటి స్థానం సాధించిన నిజామాబాద్‌కు బంగారు పతకం, రెండో స్థానంలో నిలిచిన భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ జిల్లాలకు వెండి, మూడో స్థానంలో నిలిచిన ఖమ్మంకు కాంస్య పతకాలు లభించాయి. రాష్ట్ర టీబీ విభాగం సంయుక్త సంచాలకులు ఎ.రాజేశం, నిజామాబాద్‌ డీఎంహెచ్‌ఓ సుదర్శనం, ప్రపంచ ఆరోగ్య సంస్థ కన్సల్టెంట్‌ శ్రీగణ, ప్లానింగ్‌ ఆఫీసర్‌ వాసుప్రసాద్‌లు వీటిని అందుకున్నారు.

వాణిజ్య పన్నులశాఖకు అధిక ఆదాయంపై అభినందనలు

రాష్ట్ర పన్నుల ఆదాయం రూ.70 వేల కోట్లు దాటడం చరిత్రాత్మకమని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదాయం వివరాలను శుక్రవారం ఆయన ట్విటర్‌ ద్వారా తెలిపారు. వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌ బృందం తీసుకున్న చర్యలు ప్రశంసనీయమన్నారు. ఐఐటీ-హైదరాబాద్‌కు చెందిన సమన్వయకర్త డాక్టర్‌ శోభన్‌బాబు నేతృత్వంలోని సాంకేతిక నిపుణుల బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని