త్వరలో ఈపీఎఫ్‌ వడ్డీరేటు ఖరారు

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) 2022-23 ఏడాదికి భవిష్యనిధి నిల్వలపై వడ్డీరేటును త్వరలో నిర్ణయించనుంది.

Updated : 25 Mar 2023 05:36 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) 2022-23 ఏడాదికి భవిష్యనిధి నిల్వలపై వడ్డీరేటును త్వరలో నిర్ణయించనుంది. ఈనెల 27, 28 తేదీల్లో జరిగే సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీ (సీబీటీ)ల సమావేశంలో ఈ విషయాన్ని ఎజెండాగా చేర్చింది. 2021-22 ఏడాదికి వడ్డీరేటు 8.10 శాతంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరానికి అంతే ఉంటుందా? ఏమైనా మార్పులు జరగనున్నాయా అనేది ఆ రోజు తెలుస్తుంది. ఈపీఎఫ్‌వో వార్షిక నివేదిక, నిల్వలు, లోటు తదితర అంశాలు పరిగణనలోకి తీసుకుని వడ్డీరేటును ఖరారు చేస్తారు. సీబీటీ సమావేశాన్ని తొలుత ఈనెల 24, 25 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ వివిధ సాంకేతిక కారణాలతో 27, 28 తేదీలకు వాయిదా పడింది. సమావేశంలో అధిక పింఛను ఆప్షన్‌పై వేతన జీవులు, పింఛనుదారులకు ఎదురవుతున్న ఇబ్బందులను బోర్డు సభ్యులు ప్రముఖంగా ప్రస్తావించాలని నిర్ణయించారు. అధిక పింఛను ఆప్షన్‌కు అడ్డుగా నిలిచిన పేరా నంబరు26(6) నుంచి ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వాలని కోరనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని