రాష్ట్రంలోనే తొలి రూరల్‌ మార్ట్‌ సేవలు

హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో రాష్ట్రంలోనే తొలిసారిగా రూరల్‌ మార్ట్‌ (సూపర్‌ మార్కెట్‌) సేవలు అందుబాటులోకి వచ్చాయి.

Published : 25 Mar 2023 03:29 IST

ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

ఐనవోలు, న్యూస్‌టుడే: హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో రాష్ట్రంలోనే తొలిసారిగా రూరల్‌ మార్ట్‌ (సూపర్‌ మార్కెట్‌) సేవలు అందుబాటులోకి వచ్చాయి. నందనం కర్షక సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు. దీని నిర్వహణ కోసం రూ.65 లక్షలతో ధాన్యం నిల్వగోదాం, రూ.35 లక్షలతో దుకాణ సముదాయ భవనం నిర్మించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. గ్రామీణులకు 500 రకాలకు పైగా నిత్యావసరాలను ఎమ్మార్పీ కంటే 5 శాతం తక్కువకే విక్రయించడం అభినందనీయమన్నారు. సొసైటీల బలోపేతంతో రైతులు, వినియోగదారులకు మేలు జరుగుతుందని, రూరల్‌ మార్ట్‌ సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించిన ఆధారాలున్నాయని చెబుతున్న బండి సంజయ్‌, రేవంత్‌రెడ్డిలు వాటిని చూపకపోతే జైలుకెళ్లడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్‌, అరూరి రమేష్‌, టెస్కాబ్‌ ఛైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, డీసీసీబీ ఛైర్మన్‌ ఎం.రవీందర్‌రావు, జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని