ఖగోళంలో వింత... చంద్రుడితో శుక్ర గ్రహణం
ఆకాశంలో శుక్రవారం రెండు అరుదైన ఘటనలు చోటుచేసుకున్నట్లు ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎన్.శ్రీరఘునందన్ తెలిపారు.
నారాయణగూడ, న్యూస్‌టుడే: ఆకాశంలో శుక్రవారం రెండు అరుదైన ఘటనలు చోటుచేసుకున్నట్లు ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎన్.శ్రీరఘునందన్ తెలిపారు. ‘చంద్రునితో శుక్ర గ్రహణం, శుక్రునితో చంద్ర సంయోగం జరిగాయి. ఇవి సూర్యాస్తమయానికి ముందే జరగడంతో మనకు కనిపించలేదు. ఈ శుక్రగ్రహణం సాయంత్రం 4:45 గంటలకు మొదలై 5.30 గంటలకు ముగిసింది. లద్దాక్‌లోని అన్‌లే అబ్జర్వేటరీలో శాస్త్రవేత్తలు దీన్ని పరిశీలించారు. రాష్ట్రంలో చాలాచోట్ల రాత్రివేళ ఆకాశంలో చూసినప్పుడు మాత్రం చంద్రుడి కింది భాగంలో చుక్క కనిపించింది. అది నక్షత్రం కాదు.... శుక్రగ్రహం. ఈ రెండూ పక్కపక్కనే ఉన్నట్లు కనిపించినప్పటికీ వాస్తవానికి వాటి మధ్య 18.54 కోట్ల కిలోమీటర్ల దూరం ఉంటుంది. భూమి నుంచి శుక్రగ్రహం 18.55 కోట్ల కిలోమీటర్ల దూరంలో, భూమి నుంచి చంద్రుడు 3,75,063 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఇలాంటి వింతలు ఈ ఏడాది ఆగస్టు వరకు కనిపిస్తాయి. చంద్రుడు, శుక్రుడు దగ్గరగా రావడాన్ని శనివారం సైతం చూడవచ్చు. ఆ తర్వాత దూరంగా వెళతాయి’ అని ఎన్.శ్రీరఘునందన్ వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
KTR: బెంగళూరుతో పోటీ పడేలా హైదరాబాద్‌ను నిలబెట్టాం: కేటీఆర్
-
General News
TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదాకు హైకోర్టు నిరాకరణ
-
India News
Mukhtar Ansari: గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీకి యావజ్జీవ కారాగార శిక్ష
-
India News
Wrestlers Protest: రైల్వే విధుల్లోకి టాప్ రెజ్లర్లు.. ఆందోళన కొనసాగుతుంది
-
Crime News
Jogulamba Gadwal: కృష్ణా నదిలో ఈతకు వెళ్లి నలుగురి మృతి
-
Sports News
WTC: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్.. ఆ జట్టులో రిషభ్ పంత్‌కు స్థానం!