విదేశీ ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడొద్దు

విదేశీ ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడవద్దని, పర్యాటక వీసాల పేరిట కార్మికులను పంపడం మానేయాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి విదేశీ నియామక సంస్థలకు సూచించారు.

Updated : 25 Mar 2023 05:13 IST

విదేశీ నియామక సంస్థలతో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి

ఈనాడు,హైదరాబాద్‌ : విదేశీ ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడవద్దని, పర్యాటక వీసాల పేరిట కార్మికులను పంపడం మానేయాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి విదేశీ నియామక సంస్థలకు సూచించారు. ప్రభుత్వ విదేశీ నియామక సంస్థ (టామ్‌కామ్‌) సేవలను వినియోగించుకోవాలన్నారు. శుక్రవారం న్యాక్‌లో విదేశీ నియామక సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘తెలంగాణలో ఉన్న యువతకు స్థానికంగానేగాక విదేశాల్లో ఉద్యోగాల కల్పనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లు ప్రత్యేకశ్రద్ధ చూపుతున్నారు. దీనికోసం టామ్‌కామ్‌ సంస్థ విస్తృతస్థాయిలో పనిచేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు నిజామాబాద్‌, కరీంనగర్‌ టామ్‌కామ్‌ కేంద్రాలున్నాయి. త్వరలో జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్‌, ఆదిలాబాద్‌ రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోనూ ప్రారంభిస్తున్నాం. గల్ఫ్‌దేశాలకే కాకుండా అన్ని దేశాల్లోనూ ఉపాధి అవకాశాలున్నందున శిక్షణనిచ్చి అక్కడికి పంపుతున్నాం. తిరిగి వచ్చే వారికి కూడా కావలసిన చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో విదేశీ నియామక సంస్థలు భాగస్వాములు కావాలి’’ అని తెలిపారు. సమావేశంలో టామ్‌కామ్‌ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్యయ ఇతర అధికారులు, విదేశీ నియామక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు