భక్తిప్రపత్తులతో రామాయణ మహాక్రతువు

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం మూలవిరాట్‌ స్వర్ణ కవచాల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీరామ నవమి-పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం ఉత్సవాలను పురస్కరించుకుని చేపట్టిన రామాయణ మహాక్రతువు భక్తిప్రపత్తులను చాటింది.

Published : 25 Mar 2023 03:29 IST

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం మూలవిరాట్‌ స్వర్ణ కవచాల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీరామ నవమి-పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం ఉత్సవాలను పురస్కరించుకుని చేపట్టిన రామాయణ మహాక్రతువు భక్తిప్రపత్తులను చాటింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు తాత్కాలిక యాగశాలల్లో హోమాలు నిర్వహించి, శ్రీరామ షడక్షరీ మంత్రాన్ని పఠించారు.  దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన రుత్విక్కులు నిత్య పూర్ణాహుతిలో పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని