అప్పుల కోసం అప్పులు
‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న రుణాల్లో ఎక్కువ భాగం రుణాల చెల్లింపులు, రెవెన్యూ పద్దుల్లో లోటును భర్తీ చేసేందుకు వినియోగించడం వల్ల రాష్ట్రం సేకరించిన రుణాల ఉత్పాదక సామర్థ్యం తగ్గుతోంది.
ఏపీ రుణ వలయంలో చిక్కుకునే అవకాశాన్ని కొట్టి పడేయలేం
కాగ్ నివేదిక తీవ్ర వ్యాఖ్యలు
అప్పులు తెచ్చి అప్పులే తీరుస్తున్నారు
ఈనాడు, అమరావతి: ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న రుణాల్లో ఎక్కువ భాగం రుణాల చెల్లింపులు, రెవెన్యూ పద్దుల్లో లోటును భర్తీ చేసేందుకు వినియోగించడం వల్ల రాష్ట్రం సేకరించిన రుణాల ఉత్పాదక సామర్థ్యం తగ్గుతోంది. బడ్జెట్లో చూపకుండా ఇతర మార్గాల్లో తీసుకుంటున్న రుణాలను కూడా పరిగణిస్తే రాష్ట్ర రుణ చెల్లింపుల భారం విస్ఫోటక పథంలో పయనిస్తోంది. రానున్న సంవత్సరాల్లో రుణాలను భరించే సామర్థ్యం ఉండే అవకాశం లేదు’ అని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదిక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎండగట్టింది. ‘రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో (జీఎస్డీపీ) రుణ నిష్పత్తి 2017-18 నుంచి 2021-22 సంవత్సరాల మధ్య పెరుగుదల సరళిని నమోదు చేసింది. కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రత్యేక వాహక నౌకల (స్పెషల్ పర్పస్ వెహికల్) ద్వారా తీసుకున్న రుణాలపైనే రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడుతోంది. 2022 మార్చి 31 నాటికి జీఎస్డీపీలో రుణాల శాతం 31శాతమే ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్నా నిజానికి రాష్ట్ర రుణాల భారం అంతకుమించి ఉంది. బడ్జెటేతర రుణాలను ఇతర నిబద్ధ బాధ్యతలను కూడా లెక్కలోకి తీసుకుంటే జీఎస్డీపీలో రుణాల శాతం 42.33 శాతంగా ఉంది. ఇది నిర్దేశించిన పరిమితి కన్నా 6.73శాతం అదనంగా ఉంది’ అని కాగ్ స్పష్టీకరించింది.
ఈ రుణభారాన్ని అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం అదనపు రెవెన్యూ వనరులు సమకూర్చుకునేలా చూడటంతో పాటు రుణ వ్యూహాన్ని రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఈ బాధ్యతను నిర్వర్తించడానికి నిర్దిష్ట ప్రణాళిక లేకపోతే అభివృద్ధి కార్యకలాపాల కోసం మిగిలే వనరులు తగ్గిపోయే అవకాశం ఉంది’ అని కాగ్ కుండబద్దలు కొట్టింది. అంటే చేసిన అప్పులు తీర్చుకునేందుకు రాబడి పెంచుకోకుంటే అభివృద్ధి శూన్యమయ్యే పరిస్థితి ఉంటుందని విశ్లేషించింది. 2021-22 నుంచి ప్రారంభిస్తే 2030-31నాటికి ఉన్న గణాంకాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.3,47,944.64 కోట్లు వడ్డీలు, అసలు కలిపి చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తే 2024-25లో రుణాలు తిరిగి చెల్లించే బాధ్యత పతాక స్థాయికి చేరనుంది. ఆ ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత లెక్కల ప్రకారం రూ.42,362.20 కోట్ల రుణం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ రుణ బాధ్యత సరళి కొద్దిగా తగ్గే అవకాశం ఉన్నా ఆదాయాలు పెంచుకోకుండా ఖర్చుల కోసం బహిరంగ మార్కెట్ రుణాలు, ఇతర అప్పులపై ఆధారపడితే రుణ భారం మరింత పెరిగే అవకాశమూ లేకపోలేదని హెచ్చరించింది.
అప్పుల వలయంలో చిక్కుకునే ప్రమాదం..!
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనుల కోసం ఈ అప్పులు చేయడంలేదని కాగ్ నివేదిక పేర్కొంది. ‘‘2017-18 నుంచి 2021-22 మధ్య రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చి ఆ సొమ్ముతో పాత అప్పులు తీర్చేందుకే వినియోగిస్తోంది. కొత్త అప్పుల్లో 65 నుంచి 83 శాతం మొత్తాన్ని పాత అప్పులు తీర్చేందుకే వినియోగిస్తున్నారు. ఈ అప్పులు మూలధన ఆస్తుల సృష్టికి (అభివృద్ధికి) కాకుండా రుణ విమోచనకే ఖర్చు చేస్తున్నట్లు ఆ సరళి తెలియజేస్తోంది. సేకరించిన రుణాలను స్థిరాస్తుల సృష్టికి వినియోగించ కుండా రుణాల చెల్లింపులకే వినియోగించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం పెరిగి, ప్రభుత్వ రుణం భరించలేనిదిగా మారి, రాష్ట్రం అప్పుల వలయంలో చిక్కుకునే అవకాశాన్ని కొట్టిపడేయలేము’ అని కాగ్ హెచ్చరించింది.
అభివృద్ధి పనులపై వ్యయం తక్కువే!
రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం వెచ్చించే మూలధన వ్యయం వాటా తక్కువగా ఉంటోంది. సాధారణంగా అన్ని రాష్ట్రాలూ తమ మొత్తం వ్యయంలో సగటున 14.41శాతం అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ మాత్రం మూలధన వ్యయం(అభివృద్ధి పనులు) కోసం 9.21శాతమే ఖర్చు చేస్తోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇది తక్కువగా ఉంది.
బడ్జెట్లో ఎన్నో భారాలు చూపడం లేదు!
‘గత సంవత్సరంతో పోలిస్తే చెల్లించాల్సిన రుణాలు 6.97శాతం మేర పెరిగాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో భారాలను బడ్జెట్లో చూపడం లేదు. బడ్జెటేతర రుణాల రూపేణా రూ.1,18,394 కోట్లు, 2021-22 సంవత్సరానికి డిస్కంలకు చెల్లించాల్సిన బకాయిలు, నీటిపారుదల ప్రాజెక్టులకు, నీటి సరఫరా పథకాలకు చెల్లించవలసిన తప్పనిసరి బకాయిలు రూ.17,804.20 కోట్ల మేర ఉన్నాయి. వీటిని బడ్జెట్లో భాగంగా చూపడం లేదు. ఇది ప్రభుత్వ ఆర్థిక నిర్వహణను, శాసనసభ పర్యవేక్షణ పాత్రను నిర్వీర్యం చేయడమే కాకుండా కీలకమైన మౌలిక సదుపాయాల కల్పన పథకాలకు నిధుల కేటాయింపుపై శాసనసభ నియంత్రణ దాటిపోయేలా ప్రభావం చూపుతుంది’ అని కాగ్ విశ్లేషించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్చిలోనే వడగాలులు!
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్‌కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. -
మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
వ్యాట్‌నూ తాగేశారు
మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. -
తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!
స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. -
యాదాద్రిని సందర్శించిన భారత నౌకాదళాధిపతి
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు. -
మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్ పాంక్రియాస్ సెంటర్
క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ పాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఎన్హెచ్ఎం నిధులు రానట్లే!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది. -
పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. -
చి‘వరి’కి మిగిలింది చెలమ నీరు..
మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది. -
శ్రీవారి సేవలో తెలంగాణ ఇన్‌ఛార్జి గవర్నర్
తెలంగాణ ఇన్‌ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
భారత్, ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు
రాయదుర్గం టీ హబ్‌లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. -
చెంగిచర్ల పార్థీబస్తీలో బాధితులకు బండి పరామర్శ
హోలీ రోజు హైదరాబాద్ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు
రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది. -
రెండు రోజుల్లో జస్టిస్ ఘోష్‌కు ‘ఉత్తర్వుల’ ప్రతి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్‌కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్‌కు నీటిపారుదల శాఖ అందించనుంది. -
ఫోన్‌ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్‌రావుల పోలీస్ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. -
టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు
తెలంగాణలో టెట్-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం తెలిపారు. -
నెట్ స్కోర్‌తో పీహెచ్డీ ప్రవేశాలు
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. -
సంక్షిప్త వార్తలు (3)
ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్‌డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్‌రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం